ఈ రోజుల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు అవసరం అవుతోంది. అయితే ఆధార్ కు ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఇందులో మోసం కూడా అలాగే పెరిగింది. ఆధార్ లో నకిలీ తో పాటు ట్యాంపరింగ్ కూడా పెరిగిపోతోంది. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండడానికి యుఐడిఎఐ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆధార్ కార్డును గుర్తింపు తీసుకోవడానికి ముందు కార్డుదారుల గుర్తింపును ధృవీకరించాలి అని హెచ్చరించింది.
ఆధార్ అంటే దానిపై కనిపించే 12 అంకెల నెంబర్ కాదని, ఒక వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ చెల్లుబాటు అవుతుందా ? లేదా ? అది ఒరిజినలా ? కాదా ? అని తెలుసుకోవడాని యుఐడిఎఐ అధికారిక వెబ్ సైట్ ను ఉపయోగించవచ్చని తెలిపింది. అంతేకాకుండా “ఎంఆధార్” యాప్ ద్వారా కూడా స్పష్టంగా తెలుస్తుందని వెల్లడించింది.
ఆధార్ కార్డు ఒరిగినలా ? కాదా ? అనే విషయాన్ని ఆన్లైన్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ తెలుసుకోవచ్చు. దీని కోసం యూజర్లు “resident. Uidai.gov.in/verify” అనే లింక్‌కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ టైప్ చేయాలి. అప్పుడు సెక్యూరిటీ కోడ్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. తరువాత ప్రొసీడ్ టు వెరిఫైపై క్లిక్ చేయాలి. 12 అంకెల నంబర్ ధృవీకరణ తెరపై ప్రదర్శించబడుతుంది. ఇది మీ అసలు ఆధార్ నంబర్.
Advertisements
యుఐడిఎఐ ఆఫీస్ మెమోరాండం ప్రకారం ఆధార్ కార్డు హోల్డర్ తన పేరును రెండుసార్లు మాత్రమే ఆధార్ కార్డులో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుట్టిన తేదీ, లింగాన్ని అప్‌డేట్ చేయవచ్చు.