దళిత టెక్నీషియన్స్ ను అవమానించేలా మాట్లాడిన నటి మీరా మిథున్ ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండస్ట్రీలో షెడ్యూల్ కులాలకు చెందిన వారిని గెంటేయాలని ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. దాని ఆధారంగా కేసు నమోదవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ దర్శకుడు అనుమతి లేకుండా తన ఫోటోను వాడుకున్నాడని ఆరోపిస్తూ… షెడ్యూల్డ్ కులాలను అవమానించింది మీరా మిథున్. క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటారని.. వారి కారణంగానే గొడవలు జరుగుతున్నాయని.. వాళ్లందరినీ వెళ్లగొడితే క్వాలిటీ సినిమాలు వస్తాయని చెప్పుకొచ్చింది.
మీరా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీఎస్కే పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.