కెప్టెన్ గా, ఆటగాడిగా ఈఏడాది ఐపీఎల్ లో విఫలమైన చెన్నై ఆటగాడు ధోనీని వచ్చే ఏడాది తప్పించబోతున్నారా…? అదే జరిగితే ధోనీ ఆటగాడిగా ఉంటారా లేక జట్టుతోనే మరో పాత్రకు మారిపోతారా…? అన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ బాంబు పేల్చాడు.
చెన్నై జట్టుకు వచ్చే ఏడాది కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉందని, దక్షిణాఫ్రికా ఆటగాడు డూప్లిసెస్ కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని సంజయ్ బంగర్ కామెంట్ చేశాడు. అయితే ధోనీని పూర్తిగా పక్కన పెట్టకుండా ఆటగాడిగా కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
2011తర్వాత భారత జట్టు కెప్టెన్ గా తప్పుకొని కొంతకాలం సభ్యుడిగా కొనసాగాడని, ఆ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చాడని… ఇక్కడ కూడా వచ్చే సీజన్ లో కెప్టెన్సీ బాధ్యతలు తప్పుకొని… ఆటగాడిగా కొనసాగి, ఆ తర్వాతి సీజన్ కు రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించాడు.
సంజయ్ బంగర్ వ్యాఖ్యల నేపథ్యంలో… చెన్నై టీం యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.