శ్రీలంక ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగ పెరిగిపోయింది. దీంతో నిత్యావసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో శ్రీలంక ప్రజలతో పాటు ఇతర దేశాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీలంక వెళుతున్న తమిళులు
సంక్షోభ సమయంలో చాలా మంది తమిళులు శ్రీలంకకు వెళుతున్నారు. వారిలో చాలా మంది దశాబ్దాల క్రితమే భారత్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ప్రస్తుతం శ్రీలకంలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటం, ఆస్తుల విధ్వసం ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల పరిస్థితి ఎలా ఉందో చూసుకునేందుకు అక్కడికి వెళుతున్నారు.
గోవా విస్తృత వర్షన్
చాలా మంది భారతీయులు శ్రీలంకను గోవాకు విస్తృత వెర్షన్‌గా భావిస్తారు. చాలా మంది పార్టీలకు వెళ్లి స్ట్రింగ్ హాపర్స్ తిని వస్తుంటారు. కానీ ఇటీవల శ్రీలంకలో పరిస్థితి మారిపోయింది. తీవ్రమైన ఆహార కొరత, సుదీర్ఘ విద్యుత్ కోతలు, హింసాత్మక ఘటనలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెట్రోల్, గ్యాస్ ల కోసం కిలో మీటర్ల మేర క్యూ లైన్లు
శ్రీలంకలో పెట్రోల్, గ్యాస్ కోసం ప్రజలు క్యూ లైన్లు కడుతున్నారు. కర్ఫ్యూ సమయాలు ముగిసిన తర్వాత గ్యాస్ కంపెనీల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్, చమురు కొరతలు కారణంగా చాలా మందికి గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. గ్యాస్ కోసం వెళ్లిన వారికి రేపు రండి లేదా ఎల్లుండి రండి అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీంతో చాలా మంది నిరాశగా ఇండ్లకు తిరిగి వెళుతున్నారు.