బజ్జీలు, బొండాలు ప్రాణాలు తీస్తాయా అంటే వితంగా ఉండేది. కానీ నిజంగానే ఓ మహిళ ప్రాణం తీశాయి. మామలుగా అయితే బజ్జీలు, బొండాలు కనపడితే నోరూరుతుంది. కానీ అవి తినే ఆత్రుతలో గొంతులో బజ్జీ ఇరుక్కొని ఊపిరాడక ఓ మహిళ చనిపోయింది. ఇలా చనిపోవటంపై పోలీసులు కూడా షాకయ్యారు.
చెన్నై కామరాజర్ నగర్‌లో నివాసం పద్మావతి, గంగాధర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.