వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసును హైకోర్టు మరోసారి విచారించింది. ఆయనకు జర్మన్ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ దృవీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో గత 10సంవత్సరాలుగా జర్మన్ పౌరుడు భారత చట్ట సభల్లో సభ్యుడిగా ఉన్న అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు.
అయితే, కేసు విచారణకు సంబంధించిన రోస్టర్ మారినందున సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చల్లా కోదండరాం తెలిపారు. కేసును త్వరగా విచారించాలని పిటిషనర్ కోరగా… వీలైనంత త్వరగా కేసును సంబంధిత బెంచ్ ముందు లిస్ట్ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించి, వాయిదా వేశారు.
కేంద్రం ఇప్పటికీ జర్మన్ పౌరుడేనని దృవీకరించిన నేపథ్యంలో… ఆయనపై అనర్హత వేటు ఖాయమని పిటిషనర్ ధీమాగా ఉన్నారు.