లాక్‌డౌన్‌లో అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం కోరుతున్నా.. కొందరు యువకులకు అది పట్టడం లేదు. నిబంధనలు ఉల్లఘించి రోడ్లపైకి రావడమే గాకుండా.. గుంపులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటివారికి బుద్ధి చెప్పేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.
అనవసరంగా బయట తిరుగుతున్న యువకులను ఎక్కడికక్కడ పట్టుకుని.. వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ .. కరోనా వైరస్ వ్యాప్తి కారణమయ్యేవారికి చెక్‌పెడుతున్నారు. ఈ క్రమంలో పదుల మంది ఆకతాయిలను పట్టుకుని.. బెల్లంపల్లి, సుల్తానాబాద్ సుల్తానాబాద్‌లోని ఐసోలేషన్ సెంటర్లకు పంపించారు పోలీసులు. అలాగే బైక్‌లను సీజ్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. ముఖ్యంగా యువకులు నిబంధనలు ఉల్లఘించిన కేసుల పాలు కావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.