ఢిల్లీ: మన బ్యాంక్ ఖాాతాలో బ్యాలెన్స్ చూసుకోకుండా ఎవరికీ చెక్కులు ఇవ్వకండి. ఎందుకంటే, ఈమధ్యే దీనికి సంబంధించి కేంద్రం చట్ట సవరణ చేసింది. ఇక మీదట చెక్కులు బౌన్స్ అయితే ఆ చెక్కు విలువలో 20 శాతం ముందస్తుగా కేసు తేలే వరకు కోర్ట్ ద్వారా అవతల పార్టీకి ఇవ్వాలి. అంతకంటే డేంజర్ ఏంటంటే.. ఇదివరకు చెక్ బౌన్స్ అయితే కేసు ఊళ్లోనే నడిచేది. ఇప్పుడు సీన్ సితార్ అవుతోంది. ఉదాహరణకి ఇచ్చిన చెక్ అవతలి వాళ్ళు తమిళనాడులో ఒకటి, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి, ఢిల్లీలో ఒకటి ప్రెజెంట్ చేశారో ఇక బుక్కయిపోయినట్టే. బ్యాలెన్స్ లేక అవి కానీ బౌన్స్ అయ్యాయో ఇక మన తాతలు దిగొస్తారు. వాళ్ళు అక్కడ కోర్ట్‌లోనే కేసులు వెయ్యవచ్చు. అంటే, ఆ ఊళ్ళో కోర్టు చుట్టూ తిరగాల్సిందే. చెల్లని చెక్ ఇకపై చాలా ప్రమాదకరమని చెప్పండి, అందరికీ! ఎన్నో లక్షల చెక్కు బౌన్స్ కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్న కారణంగా ఇలా కఠినంగా చట్ట సవరణ చేశారు. ఇటీవలే పాస్ అయిన బిల్లులలో ఇది ఒకటి.