జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ షురూవైంది. ఈ క్రమంలో చర్లపల్లి డివిజన్ పర్యటనకు వెళ్లిన నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వచ్చే ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి రామ్మోహన్ తన సతీమణి శ్రీదేవిని నిలబెట్టాలని చూస్తే.. తాము సహకరించేది లేదని బాహటంగానే తేల్చి చెప్పారు.
ఇన్నాళ్లు తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు కూడా సరిగా చేయలేదని.. ఎన్నికలున్నాయి కాబట్టి తాము గుర్తొచ్చామా అని వారు నిలదీశారు. వరద సాయం కూడా తమకు సరిగా అందలేదని వారు ఆరోపించారు.ఈ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ టికెట్ స్ధానికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.