ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రిపుల్ ఆర్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రేక్షకులు, అభిమానులు, సెలబ్రిటీలు ఎవరి నోట విన్నా ట్రిపుల్ ఆర్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ అయినా ట్రిబుల్ ఆర్ శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు రావటంతో ఇరువురి హీరోల అభిమానులు చేసే హడావుడి మాములుగా లేదు.
100 seetharama rajus take over hyderabad#RamCharan #RRRMovie pic.twitter.com/mJkOhiiFoR
— Sreedhar Marati (@SreedharSri4u) March 25, 2022
Advertisements
రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద గురువారం రాత్రి నుంచే ఫ్యాన్స్ సందడి నెలకొంది. తమ అభిమానా కటౌట్స్, బ్యానర్స్ కట్టి హంగామా చేశారు. అసలే ఈ మూవీ కోసం ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ నాలుగేళ్లుగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెర్రీపై తమకున్నా అభిమానాన్ని డిఫరెంట్ గా చాటుకున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన చెర్రీ అభిమానులు 100 మంది అల్లూరి సీతారామ రాజు వేషధారణలో హైదరాబాద్‌కు బైక్ ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బైకులపై ర్యాలీగా వారు హైదరాబాద్‌కు వచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.