చెరుకు సుధాకర్
ఇంటి పార్టీ అధ్యక్షుడు
కృష్ణా నదిలో నుండి ఏపీ ప్రభుత్వం అక్రముగా నీటిని తరలించుకు పోతున్న టీ ఆర్ ఎస్ ప్రభుత్వం మౌనముగా ఉండటం సరికాదు. సీఎం కేసీఆర్ ఈ విషయం లో ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ లో నిర్వహిస్తున్న కరోనా టెస్టుల విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం లో మంత్రి ఈటల రాజేందర్ స్పందించాలి. ICMR మార్గదర్శకాల ప్రకారం టెస్టులు నిర్వహిస్తే…. ఆ మార్గదర్శకాలను విడుదల చేయాలి. లేని పక్షంలో ICMR మార్గదర్శకాలను మేమే విడుదల చేస్తాం.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉద్యోగాలను ప్రమాదం లో పడేసిన జీ ఓ 3 పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వాదనలు బలంగా వినిపించలేదు. తక్షణమే సుప్రీంలో మళ్ళీ పిటిషన్ వేయాలి. కరోన టెస్టుల విషయం లో ఐసీమర్ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటె…. ఈ విషయం లో మంత్రి ఈటల బహిరంగ చర్చకు సిద్ధమేనా. కోర్ట్ లు ఇటీవల ప్రజలకు వ్యతిరేకముగా తీర్పునివ్వడం గర్హనీయం. వలస కార్మికుల కేస్ విషయంలో లాయర్ ప్రశాంత్ భూషణ్ ను సుప్రీమ్ జడ్జి లు అవమనిచడం సరికాదు.