సొంత ఊర్లో అభివృద్ధి చెయ్యలేని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఎం మాట్లాడుతాడని ప్రశ్నించారు ఎమ్మెల్స అభ్యర్థి చెఱుకు సుధాకర్. ఒక్క కాలేజీతో మొదలైన పల్లా ఈ రోజు యూనివర్సిటీ స్థాయికి చేరిండని, ఒక్కనాడు కూడా మండలిలో మాట్లాడని మూగ జీవి పల్లాకు ఓటువెస్తే నిన్ను నువ్వే బానిస చేసుకున్నట్టు అంటూ గ్రాడ్యుయేట్స్ కు విజ్ఞప్తి చేశారు.
పల్లా గెలిస్తే జగదీష్ రెడ్డి మంత్రి పదవి ఊడటం ఖాయమని చెఱుకు సుధాకర్ హెచ్చరించారు. పల్లాను గెలిపిస్తే ఫాంహౌజ్ లో సోడా కలిపేందుకు తప్పా ఎందుకు పనికిరాడన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, రౌడీయిజం పెరుగుతుంది. ఇసుక మాఫియా మొత్తం ప్రభుత్వ పెద్దల కనుసైగల్లో నడుస్తుందన్నారు.