వాయుసేనలో చేతక్ హెలికాప్టర్లు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ హకీంపేటలో నిర్వహించిన చేతక్ హెలికాప్టర్ల వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
దేశ రక్షణ వ్యవస్థలో ఆ హెలికాప్టర్లది ప్రత్యేక స్థానమని కొనియాడారు. మన చేతక్ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు పుడుతుందని వ్యాఖ్యానించారు.
రాణాప్రతాప్ గుర్రం పేరు చేతక్ చరిత్ర విన్నామని అన్నారు. చూసేందుకు చిన్నదైనా చేతల్లో విధ్వంసం చేయగల సత్తా చేతక్ కు ఉందని పేర్కొన్నారు.
ఎలాంటి విపత్తు వచ్చినా చేతక్ ఉపయోగించాల్సిందేనని ఆయన వివరించారు రాజ్‌నాథ్‌సింగ్. కాగా.. ఈ వేడుకలకు ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులు హాజరయ్యారు.