బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ వైదొలిగారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జేషాకు ఆయన తన రాజీనామా లేఖ పంపించారు. మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
వీడియోలో ఆయన మాట్లాడుతూ పలు సమస్యల గురించి ప్రస్తావించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబధాలపై ఆయన వీడియోలో వ్యాఖ్యలు చేశారు.
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా గతనెల చేతన్ శర్మను బీసీసీఐ మరోసారి నియమిచింది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన చిక్కుల్లో పడ్డారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో 30 నిమిషాలు ఎలా మాట్లాడాడో చెబుతూ చేతన్ శర్మ పట్టుబడ్డాడు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి మధ్య జరిగిన వివాదం గురించి ఆయన వివరించారు.
మీడియా సంస్థ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. టీమిండియాకు సంబంధించి పలు రహస్యమైన విషయాలు బయటకు రావడంతో బీసీసీఐ సీరియస్ తీసుకున్నట్టు తెలుస్తోంది.