కరోనా వైరస్ తో భారత్ లో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మరో వైపు లాక్ డౌన్ క్రమేణా పెంచుకుంటూ పోవటంతో దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి. 9వ తరగతి విద్యార్థుల వరకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తామని రాష్ట్రాలన్నీ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఛత్తీస్గడ్ ప్రభుత్వం మాత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇదివరకు రాసిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిసల్ట్ ను దీనికోసం ప్రామాణికంగా తీసుకోనున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేకే ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుందట. అంతే కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కుడా దగ్గరోనే ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.