మాజీ హోంమంత్రి చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో జైలులో ఉన్న చిదంబరంకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఇప్పటికే ఈడీకి కస్టడీకి ఇవ్వటంతో… బెయిల్ వచ్చినప్పటికీ, ఈ నెల 24 వరకు చిదంబరం బయటకు వచ్చే అవకాశం కనపడటం లేదు.