సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ రోజు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తన పెంపుడు కుమార్తెలను ఈ రోజు సుప్రీం కోర్టుకు తీసుకు వచ్చారు. వారిని తన ఛాంబర్ కు తీసుకు వచ్చి న్యాయస్థానం కార్యకలాపాల గురించి వారికి వివరించారు.
han
ఇదంతా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనిస్తూ అలా ఉండిపోయారు. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పెంచుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు వారిద్దరితో కలిసి ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు.
పబ్లిక్ గ్యాలరీ నుంచి వారు న్యాయస్థానంలోకి ప్రవేశించారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తులు ఎక్కడ కూర్చుంటారు, న్యాయవాదులు ఎక్కడ నుంచి వాదనలు వినిపిస్తారో వారికి వివరించారు. ఆ తర్వాత అక్కడ నుంచి వారిని తన చాంబర్ కు తీసుకు వెళ్లారు.
తమకు న్యాయస్థానం కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని అనిపిస్తోందని సీజేఐని ఆయన కుమార్తెలు అడిగారని కోర్టు వర్గాలు తెలిపాయి. ఆయన విధుల గురించి తెలుసుకోవాలని, అందుకే కోర్టుకు తీసుకు వెళ్లాలని వారు కోరారని చెప్పారు. ఈ క్రమంలో వారిని సీజేఐ న్యాయస్థానానికి తీసుకు వచ్చారని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.