భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పంజాబ్ లోని వాఘా బార్డర్ ను గురువారం ఉదయం సందర్శించారు. దీంతో వాఘా బార్డర్ ను సందర్శించిన భారత తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డును సృష్టించారు.
జలియన్ వాలా బాగ్ వద్ద స్మారకం వద్ద అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. ఆ తర్వాత జీరో పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బందిని ఆయన కలుసుకున్నారు.
బీఎస్ఎఫ్ నిర్వహించిన పరేడ్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికులు ఆయన గౌరవ వందనం సమర్పించారు. సీజేఐకి ఆర్మీ సిబ్బంది ప్రత్యేక టోపీని అందజేశారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం సాయంత్రం పంజాబ్ కు చేరుకున్నారు. ఆయనకు పంజాబ్ హైకోర్టు సీజేతో సీఎం భగవంత్ మాన్ ఘన స్వాగతం పలికారు.