ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి ఇంటికి వెళ్లిన ఏక్ నాథ్ షిండేకు ఘన స్వాగతం లభించింది. షిండేకు ఆయన భార్య ఘన స్వాగతం పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసోం క్యాంపు నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఆయన నేరుగా ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక, బల నిరూపణ పరీక్షలతో ఆయన బిజీబిజీగా గడిపారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లలేకపోయారు.
తాజాగా ఆయన పనులన్ని ముగించుకుని థానేలోని తన ఇంటికి వెళ్లాడు. షిండే రాక సందర్భంగా ఆయన భార్య స్వాగత ఏర్పాట్లను ఘనంగా చేశారు. ముఖ్యంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఓ ప్రత్యేకమైన బ్యాండ్ బృందాన్ని పిలిపించారు.
ఇక షిండే రాగానే ఆనందంతో ఊగిపోయిన ఆమె సొంతగా బ్యాండ్ వాయిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఆమె అంత బాగా బ్యాండ్ వాయించడం చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఆమె బ్యాండ్ వాయిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. గ్రాండ్ వెలకం అంటే ఇలా ఉండాలని అంతా అంటున్నారు.