మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటూ ఆయనను… గుర్తు చేసుకుంటున్నారు. కాగా ఆయన తనయుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాటతప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశలే నాకు వారసత్వం ప్రజల ముఖాల్లో విరిసే సంతోషం లో నిను చూస్తున్నా… పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడలను స్మరిస్తూనే ఉన్నా. జన్మదిన శుభాకాంక్షలు నాన్న.. అంటూ జగన్ ట్వీట్ చేశారు.
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా…
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021
Advertisements