తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు జరిగింది.
ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ… వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన చెప్పారు. పార్టీ నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని వారికి సూచనలు చేశారు. నియోజక వర్గాల్లో పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్ లాంటివి నిర్వహించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించి పెండిగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం నిర్వహిస్తారు. కానీ టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినందున ఇక నుంచి సమావేశం ఉందని తెలిపారు. దానికి బదులు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. అదే రోజు వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతిపక్షాలకు ఆరోపణలను స్ట్రాంగ్ గా తిప్పి కొట్టాలన్నారు.