వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను సర్కార్ పున ప్రారంభించింది. స్లాట్ బుకింగ్స్ పద్ధతిలో ఈనెల 14 నుండి రిజిస్ట్రేషన్స్ చేయనుండగా… డిమాండ్ ను బట్టి ఆయా సబ్ రిజిస్ట్రారర్ ఆఫీసుల్లో బుకింగ్ స్లాట్స్ పెంచబోతున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.
అయితే, ఎల్.ఆర్.ఎస్ లేకుంటే ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయమంటూ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ హైకోర్టు మాత్రం పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చని చెప్పటంతో… ఎల్.ఆర్.ఎస్ తప్పనిసరా… కాదా అన్న సందేహాం అందరిలోనూ వ్యక్తం అయ్యింది. దీనిపై పలువురు జర్నలిస్టులు సీఎస్ ను ప్రశ్నించగా చూస్తాం అంటూ సమాధానం దాట వేశారు.
దీంతో ప్రభుత్వం సబ్ రిజిస్ట్రారర్స్ కు ఎలాంటి ఆదేశాలిస్తుందన్నది కీలకంగా మారగా, ప్రజల సందేహాలు అలాగే ఉన్నాయి.