ఉద్దవ్ ఠాక్రేకు షిండే వర్గం మరో షాక్ ఇచ్చింది. పార్టీ విప్ ను ఉల్లంఘించారంటూ ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు వారిని సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ ను కోరారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. ఆ 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్టు కార్యాలయం పేర్కొంది.
శివసేన చీఫ్ విప్ గా సునీల్ ప్రభును తొలగించి ఆయన స్థానంలో గోగావాలను నూతన స్పీకర్ తాజాగా నియమించారు. ఈ పరిణామం తర్వాత ఉద్దవ్ ఠాక్రే వర్గంపై భరత్ గోగావాల స్పీకర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.
మరోవైపు సోమవారం విశ్వాస పరీక్ష నేపథ్యంలో శివసేన పక్ష నేతగా ఉన్న అజయ్ చౌదరీని తొలగించి ఆయన స్థానంలో షిండేను శివసేన పక్ష నేతగా నియమించారు.