దేశంలో బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తుంది. ముఖ్యంగా కాకుల నుండి ఈ ఫ్లూ ఇతర పక్షులు, కోళ్లకు సోకుతున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతుండగా, తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసూర్ ప్రాంతంలో 100 కాకులు మరణించాయి.
దీంతో ఆ ప్రాంతంలో 15రోజుల పాటు గుడ్లు, చికెన్ అమ్మకాలు బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షాపులు తెరవకూడదని స్పష్టం చేశారు. డిసెంబర్ 23 నుండి ఇలా వందలాది కేసులు రిపోర్ట్ అవుతున్నాయని, ఇండోర్ పట్టణంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని అక్కడి నేతలంటున్నారు.
ఈ ఎఫెక్ట్ ఇతర ప్రాంతాలపై పడనుంది. కరోనా వైరస్ విజృంభణ మొదట్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోగా… ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ దాటికి మళ్లీ పడిపోనున్నట్లు ఫౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.