నగరంలో చోటు చేసుకుంటున్న వరుస అగ్నిప్రమాదాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ఇంకా వ్యాపారస్తుల్లో మార్పు రావట్లేదన్నారు. వరుస ప్రమాదాలను చూసైనా వారిలో చైతన్యం రావాలన్నారు.
ఇకమీదట వ్యాపారస్తులకు చెప్పడం అనేది ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరి వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంటే ఎవరు ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలని మంత్రి సూచించారు.
రాబోయేది అసలే వేసవికాలం కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశం లో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో వేలాది గోదాంలు నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నాయన్నారు. రాబోతున్న వేసవిలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని… తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తలసాని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.