తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ ముందు చికోటి ప్రవీణ్ హాజరైన విషయం తెలిసిందే. నాలుగో రోజు చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ ముగియగా.. ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. విచారణ జరుగుతోందని ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని ఆయన వెల్లడించారు. విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. తనపై వస్తున్న వార్తలు అవాస్తవాలని పేర్కొన్నారు. తన పేరుతో ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు ఫేక్ అంటూ తెలిపారు చికోటి ప్రవీణ్.
అయితే క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌కు నాలుగో రోజు ఈడీ విచారణ ముగియగా.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని తెలిపిన ప్రవీణ్..తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తన పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు చీకోటి తెలిపారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఇకపై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానన్నారు. క్యాసినో నిర్వహించా.. అందులో తప్పేముందని ప్రశ్నించారు.
తనకు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని తెలిపారు. ఈడీ విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తానని చీకోటి ప్రవీణ్ తెలియజేశారు.