వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగు రోజుల శిశువు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నాదర్ గుల్ కు చెందిన స్వప్న అనే మహిళ వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది.
సోమవారం ఉదయం చిన్నారి ఏడుస్తుండటంతో.. కుటుంబ సభ్యులు డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. కానీ.. పట్టించుకోకుండా తీరిగ్గా చాలాసేపటికి పాపను పరిశీలించి చనిపోయిందని చెప్పారని వాపోతున్నారు. ముందుగా చెబితే మరో హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళమని కన్నీరుమున్నీరయ్యారు. డాక్టర్ నిర్లక్ష్యంగానే పాప మృతి చెందిందని ఆందోళనకు దిగారు కుటుంబసభ్యులు, బంధువులు.