భాష మీద ప్రేమ ఉండాలి… సినారె ఉర్దూ మీడియంలో చదివారు, నేను ఇంగ్లీషు మీడియంలో చదివాను. మేము తెలుగును మర్చిపోయామా అంటూ ప్రశ్నించారు చిలుకూరు అర్చకులు రంగరాజన్. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదని.. ఇన్నాళ్లు తెలుగు మీడియం ఉంటే 10వరకు ఏ పుస్తకాల్లోనూ రాముడి గురించి లేదని విమర్శించారు.
తెలుగు అంతరించిపోతుందని… తమిళనాడు, కర్ణాటకలో వారి వారి భాషల్లోనే ప్రభుత్వ వ్యవహారాలు జరుగుతున్నాయని.. కానీ మన తెలుగులో ఎందుకు అలా జరగడం లేదని ప్రశ్నించారు.
ఇక స్వామివారి సేవకులుగా సన్నిధి గొల్లలు, నాయీ బ్రాహ్మణులు కూడా ఉన్నారని… వారిని కొనసాగించాలన్నారు. ప్రధాన అర్చకుల వివాదం ప్రభుత్వంతోనే మొదలైందని, మరో ప్రధాన అర్చకుడిని నియమించి తప్పు సరిచేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. దేవాలయాల్లో రాజకీయాలు వద్దని 1983లోనే చల్లా కొండయ్య తన రిపోర్టులోనే పేర్కొన్నారని, కానీ ఎవరు ఫాలో అవుతున్నారని ప్రశ్నించారు.
16వేల మందికి పైగా పనిచేసే తిరుమల దేవస్థానంలో పది ఇరవై మంది ఇతర మతస్థులున్నంత మాత్రాన దాన్ని పెద్దదిగా చూపించి… తిరుమలపై దుష్ప్రచారం చేయొద్దని కోరారు.