రామానుజ సహస్రాబ్ది సమారోహం కార్యక్రమం సందర్భంగా త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వాస్తుపూజ, హోమాలు తదితర అంశాల విశిష్టతను భక్తులకు వివరించారు. అయితే.. వాస్తు పట్ల చాలా మందిలో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. కొందరిలో అపోహలు కనిపిస్తే.. మరికొందరు వాస్తును పూర్తిగా విశ్వసించే వారు ఉంటారు.. అసలు పట్టించుకోని వారూ ఉంటారు.
ముఖ్యంగా వాస్తు వెనుక ఉన్న కథను చిన్నజీయర్ స్వామి చెప్పారు. దానిని భక్తులు ఆసక్తిగా విన్నారు. పురాణాల ప్రకారం స్వేదం నుంచి ఉద్భవించిన భృగు మహర్షి అనే అసురుడు దేవతలు, మనుషులను ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడని ఆయన వివరించారు. దీంతో అతడ్ని దేవతలు అణచివేయాలనుకున్నారని చెప్పారు.
ఆ సమయంలో భృగు మహర్షి బ్రహ్మ దేవుడిని ఆశ్రయించాడని.. తనను రక్షించాలని బ్రహ్మను వేడుకొన్నాడని చెప్పారు జీయర్ స్వామి. దీంతో బ్రహ్మ.. ఏదైనా అభివృద్ధి చేసే వారిపై నీ దృష్టి ప్రభావం ఉంటుందిని.. నిన్ను శాంతింప జేస్తే బాధలు తొలగి సుఖం కలుగుతుంది అని భౄగు మహర్శికి వరమిచ్చారని వివరించారు.
అందుకే ఏదైనా నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల సమయంలో వాస్తు సూజలు, పురుషుడికి శాంతి హోమం చేయడం ఆచారంగా ఏర్పడిందని భక్తులకు వివరించారు చిన్నజీయర్ స్వామి.