ప్రాణాంతక కరోనా వైరస్ తో సతమతమవుతున్న చైనాకు సంఘీభావం తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అభినందించారు. ఇది చైనా-బీజింగ్ మధ్య స్నేహ బంధాన్ని తెలియజేసిందని అన్నారు. పొరుగు దేశం చైనాలో కరోనా వైరస్ సోకి వందలాది మంది మరణిస్తుండడంతో భారత ప్రధాని ఆ దేశానికి సంఘీభావం తెలుపుతూ లేఖ రాశారు. వైరస్ నియంత్రణకు తమ సహాయ సహకారాలను అందజేస్తామని లేఖలో తెలిపారు. హుబెయ్ ఫ్రావిన్స్ లో చిక్కుకు పోయిన ఇండియన్స్ స్వదేశం తరలిరావడానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి స్పందించిన ఆ దేశాధ్యక్షుడు ప్రధానిని అభినందించినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు.