భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తుందా… అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోకి ఏకంగా 5కి.మీ మేర 100 చైనీస్ బలగాలు చొచ్చుకొచ్చినట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు నెలలో ఇదంతా జరిగిందని ప్రకటించటం సంచలనంగా మారుతోంది.

అయితే, ఈ కథనాన్ని అధికారయంత్రాంగం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇలా చొచ్చుకొచ్చే సమయంలో అక్కడ భారత్ నిర్మించిన కొన్ని నిర్మాణాలను, ఓ బ్రిడ్జ్ ను కూడా ద్వంసం చేసినట్లు తెలుస్తోంది. చైనీస్ బలగాలు మొత్తం మూడు గంటల పాటు అక్కడే గడిపాయని కథనంలో పేర్కొంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నందాదేవి జాతీయ పార్క్ కు ఉత్తర దిశలో ఇదంతా జరిగిందని, ఉత్తరాఖండ్ తో చైనాకు 350కి.మీ బార్డర్ ఉండటంతో ఇక్కడ పోలీస్ పహారా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం స్థానికుల నుండి తెలియగానే ఆర్మీతో పాటు ఇండో-టిబెటన్ పోలీస్ ఫోర్స్ ను అక్కడి పంపినట్లు ఆ కథనాల సారాంశం. గతంలోనూ ఇదే ఏరియాలో చైనా ఆర్మీ చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసిందని, అప్పట్లో భారత జవాన్లు తిప్పికొట్టారని కొందరు అధికారులు కామెంట్ చేస్తున్నారు. అయితే, కొందరు అధికారు వాదన మాత్రం మరోలా ఉంది. బార్డర్ ఎక్కడి వరకు అనే విషయంలో భారత్, చైనాల మధ్య భిన్నాబిప్రాయాలున్నట్లు కామెంట్ చేస్తున్నారు.