ఓవైపు చర్చలు, శాంతిమంత్రం పాటిస్తూనే చైనా మరోసారి భారత్ తో కయ్యానికి కాలుదువ్వింది. లఢఖ్ సరిహద్దు రేఖ వద్ద గల్వాన్ వ్యాలీలో మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించింది. దీన్ని భారత బలగాలు పసిగట్టి వారిని నిలువరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 29న ఇదంతా జరిగిందని ఆర్మీ దృవీకరించింది.
గల్వాన్ నదీ లోయ, పాంగాంగ్ సరిహద్దు రేఖ వద్ద చైనా బలగాలు మళ్లీ భారత్ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాయి. యాథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించిందని భారత ఆర్మీ ప్రకటించింది. పాంగాంగ్ త్సో సరస్సు దక్షిణ ఒడ్డు వైపు చైనా ఆర్మీ దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. భారత సైన్యం అడ్డుకుంది. ఏల్ఏసీ వెంబడి ఏకపక్షంగా యథాతథ స్థితి మార్చేయాలనే చైనా ఉద్దేశాన్ని పసిగట్టిన భారత్ ఆ ప్రాంతంలో సైన్యం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.