చైనా మద్దతుతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలనే పాక్ ఎత్తుగడ మరోసారి విఫలమైంది. బుధవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో చాలా దేశాలు కశ్మీర్ అంశాన్ని చర్చించడానికి ఇది వేదిక కాదని తిరస్కరించినట్టు తెలిసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం, ఢిల్లీతో సంబంధాల బలోపేతంపై చర్చించాలని కోరుతూ ఇండియా కూడా పాక్ ప్రయత్నాన్ని గట్టిగానే తిప్పికొట్టింది. తప్పుడు సమాచారంతో భద్రతా మండలి సమావేశాన్ని తప్పుదోవ పట్టించాలనుకునే పాక్ ప్రయత్నం మరోసారి విఫలమైందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.