చైనా దేశం నుండి హ్యాకర్ల ఫోకస్ ఇప్పుడు ఇండియా పడింది. ముంబై కేంద్రంగా పనిచేసే పలు సంస్థలపై వల విసిరే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫలితంగా ముంబైలో చీకట్లు నెలకొన్నాయని మహారాష్ట్ర మంత్రి పేర్కొన్న కొద్దిసేపటికే సీరం సంస్థ కీలక ప్రకటన చేసింది.
ప్రపంచంలోనే సేఫ్ వ్యాక్సిన్లలో ఒకటిగా ఉన్న అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కోవిషీల్డ్ ను ఇండియాలో పుణే కేంద్రంగా సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ఇండియా సహా పలు దేశాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. ఈ దశలో చైనా హ్యాకర్లు సీరం సంస్థ డేటా చోరీకి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై సీరం సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. హ్యాకర్లు తమ డేటా చోరీకి విఫలం చేశారని… కానీ తమ నిపుణులు చోరీకి గురికాకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. తమ డేటా సేఫ్ అని ప్రకటించారు.