హైదరాబాద్: యాదాద్రి ఆలయ స్తంభాలపై బూతు శిల్పాలు పెట్టడం కేసీఆర్, కారు బొమ్మలకంటే పెద్ద వివాదమయ్యింది. ఇంత అసహ్యమయిన అశ్లీల చిత్రాలు చెక్కించిన వారెవరన్న ప్రశ్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ముఖ్య అధికారులని వేధిస్తోంది. తనకీ విషయంతో సంబంధం లేదని, ఏ శిల్పాలు చెక్కాలన్న నిర్ణయం తన పరిధిలో లేదని YTDA సీఈఓ కిషన్ రావు చెప్తున్నారు. మరి ఈ బూతుబొమ్మల నిర్ణయం ఎవరిది? అధికారులు ఈ నెపం చిన్న జీయర్ మీద వేసే ప్రయత్నం చేస్తునట్టు కనిపిస్తోంది. స్వామి వారు ఒక సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ను తీసుకొచ్చి ఆగమ శాస్త్రం ప్రకారం పూర్తి స్థాయిలో ఆదేశాలిచ్చారని, ఆ బొమ్మల బాధ్యత ఆయనదేనని అధికారుల వాదన. ఈ అంశంలో జీయర్ గారి అభిప్రాయం సంపాదించాలన్న ‘తొలివెలుగు’ ప్రయత్నం సఫలం కాలేదు.