భారత్ తో చైనా యుద్ధానికి రెడీ అవుతుందా…? అత్యాధునిక సుఖోయ్ యుద్ధ విమానాలను టిబెట్ బార్డర్ కు తరలించటంలో చైనా బిజీగా ఉందా…? ఆర్మీ చీఫ్ బార్డర్ పర్యటనతో భారత్ అప్రమత్తం కాబోతుందా…? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇండియా-చైనా బార్డర్ లో పరిస్థితులు, ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునేందుకు వరుస ఘర్షణల నేపథ్యంలో బీజేపీ సీనీయర్ నేత సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా తయారు చేసిన అత్యాదునిక యుద్ధ విమానాలైన సుఖోయ్ ను చైనా ఇండియాకు దగ్గరగా ఉండే టిబెట్ బార్డర్ కు తరలిస్తుందని హెచ్చరించారు. వెంటనే భారత్ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆయన సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.
మరోవైపు చైనా ఆర్మీతో ఎదురవుతున్న వరుస ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే భారత రక్షణ శాఖ సమీక్షిస్తుండగా… ఆర్మీ చీఫ్ ఎంఎం నర్వానే రెండ్రోజుల పర్యటన కోసం లఢఖ్ కు చేరుకున్నారు. ఆర్మీ అనుసరించాల్సి వ్యూహాలు, అక్కడున్న పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు.
Moving of Russian built Sukhoi planes in large numbers by Chinese Airforce to Tibet border with India, is an indication that we have to get ready for retaliation
— Subramanian Swamy (@Swamy39) September 3, 2020