కరోనా వైరస్ అమెరికాపై యుద్ధానికి పంపారని, అది చైనా వైరస్ అంటూ అగ్ర రాజ్యం అమెరికా చైనాపై దుమ్ముత్తిపోస్తుంది. కొంతకాలంగా చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపై మండిపడుతుంది. చైనాలోని వూహాన్ ల్యాబ్ లో వైరస్ తయారు చేసి ప్రపంచం మీదికి వదిలారని, ఇందుకు చైనా మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికా వాదిస్తుంది.
చైనా వైరస్ కామెంట్స్ పై కొంతకాలంగా రగిలిపోతున్న చైనా ఎదురుదాడిని ప్రారంభించింది. కరోనా వైరస్ కు తమది బాధ్యత అయితే… 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ, ఎయిడ్స్, 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఫైనాన్షియల్ క్రైసిస్ కు బాధ్యత వహించాలని చైనా అధికార పార్టీ పత్రికల్లో వార్తలు వచ్చాయి.
చైనాపై మిస్సోరి, మిసిసిపి రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయటం ఓ దేశ సార్వబౌమత్వంపై దెబ్బగా చైనా అభివర్ణించింది. ఇలాంటివి ఏవైనా ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అధికారికంగా దేశాల తరుపున కొట్లాడాలి కానీ ఆయా రాష్ట్రాల్లో వారి సొంత మనుషులతో కేసు పెట్టించటమేమిటని ప్రశ్నించాయి. చైనాపై ఇలాంటి చర్యలు బ్లాక్ మెయిలింగ్ గా ఉన్నాయంటూ మండిపడ్డాయి.
అయితే… చైనాలో మొదలైన కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని చెప్పటంలో ఆలస్యం చేసిందన్న వాదన కూడా ఉంది. పైగా కరోనా వైరస్ పై బటయకు మాట్లాడిన డాక్టర్లను చైనా అరెస్ట్ చేయటంతో చైనాపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానపు చూపులు మొదలయ్యాయి.