ఇప్పటి వరకు పక్షులు, కోళ్లు, జంతువుల్లో మాత్రమే బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం చూశాం. కానీ ఇప్పుడు తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని చైనా వైద్యాధికారులు ధృవీకరించారు. దీంతో చైనా అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
హెనాన్ ప్రావిన్స్ లోని ఓ నాలుగేండ్ల బాలుడికి ఈ నెల5న జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి అతనికి పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి హెచ్ 3ఎన్8 స్ట్రెయిన్ బర్డ్ ఫ్లూ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.
ఆ బాలుడితో కాంటాక్ట్ అయిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు కనిపించలేదని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు తెలిపారు. బాలుడు తన ఇంట్లో ఉన్న కోళ్లు, పక్షులతో కాంటాక్ట్ కావడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్టు పేర్కొన్నారు.
మానవులకు సోకే సామర్థ్యం బర్డ్ ఫ్లూకు తక్కువగా ఉంటుందని జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో అంటువ్యాధి పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని చెప్పింది.