చైనా నుండి మొదలై ప్రపంచ దేశాలను, ఆర్థిక వ్యవస్థలను గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారిపై డ్రాగన్ దేశం విజయం సాధించింది. ప్రతి రోజు వందల మందిని బలిగొంటూ… రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో చైనా వణికిపోయింది. కానీ ఎట్టకేలకు డ్రాగన్ కరోనాపై తొలిసారి పై చేయి సాధించింది.
చైనాలో తాజాగా కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదైంది. అంతేకాదు కరోనా వైరస్ బయటపడ్డ వుహాన్ నగరానికి మాత్రమే కరోనా పరిమితమైందని ఆ దేశం ప్రకటించింది. దీంతో విదేశాల నుండి వచ్చే వారి పట్ల చైనా మరింత అప్రమత్తతో ఉంది. తమ దేశానికి వచ్చే వారు ఖచ్చితంగా 14 రోజుల పాటు నిర్భంధంలో ఉండాలని, సోమవారం నుండి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయని స్పష్టం చేసింది. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా… 3226మంది చనిపోగా, 80,881మందిరి కరోనా వైరస్ సోకింది. 68,679మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక కరోనా వైరస్ నుండి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను రక్షించేందుకు వైట్ హౌజ్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.