అర్జెంటినాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టేందుకు చైనా రెడీ అవుతోంది. వన్ రోడ్- వన్ బెల్ట్ ఇన్ షియేటివ్ లో చేరడానికి అర్జెంటీనాతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో చైనా ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
బీజింగ్ లో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్ కు హాజరయ్యేందుకు అర్జెంటీనా ప్రధాని అల్బర్ట్ ఫెర్నాడెంజ్ ఫిబ్రవరిలో చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య జలవిద్యుత్, రైల్వే ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. చైనా మాజీ అధ్యక్షుడు క్రిస్టియానో ఫెర్నాండేజ్ హయాంలో 2015లో జరిగిన అణు ఒప్పందాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఒప్పందం మేరకు అర్జెంటినాలో రూ. 8 బిలియన్లతో హువాలాంగ్ వన్ టెక్నాలజీని ఉపయోగించి అటుచా-3 అణు విద్యుత్ చక్తి కర్మాగారన్ని చైనా నిర్మించనున్నది. ఈ కర్మాగారంతో 1200 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని అర్జెంటీనా చూస్తోంది. ఈ మేరకు ఇద్దరు అధినేతలు ఎంవోయూపై సంతకం చేశారు.
చైనా హువాలాంగ్ వన్ సాంకేతికతను యూఎస్ కు చెందిన వెస్టింగ్ హౌస్, యూరప్ ల ఈపీఆర్ లకు పోటీగా తీసుకువస్తోంది. చైనా ఈ సాంకేతికతను ఫుజియాన్‌లో ప్రవేశపెట్టింది. దేశంలో అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్మించేందుకు పాకిస్థాన్‌తో గతంలో ఒప్పందం కుదుర్చుకుంది.