ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మంచు తుఫాన్ లో చిక్కుకుని విలవిలాడుతున్నాయి. అందులోనూ చైనాలో భారీగా మంచు వర్షం కురుస్తోంది. లేటెస్ట్ గా చైనాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఒక ప్లాట్ యజమాని తన ఇంటి తలుపులు కొన్ని నిమిషాల పాటు తెరిచి ఉంచింది. ఆమె కొంచెం సేపు బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది.
ఆమె మళ్లీ తిరిగి వచ్చేసరికి.. ఇల్లు మొత్తం ఒక మంచు గుహగా మారిపోయింది. ఇది చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఇంటి తలుపులు, సీలింగ్ సహా మెట్లు రైలింగ్ ఇలా ప్రతి చోటా.. మందపాటి మంచు పేరుకుపోయింది. ఎముకలు కొరికే గాలి లోపలికి వీస్తోంది. అపార్ట్ మెంట్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది.
ఈ మంచు పూర్తిగా కరిగిపోయే వరకు ఆ అపార్ట్ మెంట్ లోని వ్యక్తులు జీవించడం కష్టమని చెప్పవచ్చు. ఈ ఇంటికి పట్టిన మంచు కరిగి.. తిరిగి అసలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టేటట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీలాంగ్ జియాంగ్ చల్లగా ఉండే ప్రదేశం.
చైనాలోని ఈశాన్య ప్రాంతంలో గల హీలాంగ్ జియాంగ్ ని ‘ఐస్-సిటీ’ అని కూడా పిలుస్తారు. ఈ నగరంలో నివసించడం అంత సులభం కాదు. స్వచ్ఛమైన గాలి, సౌకర్యవంతమైన వాతావరణం ఉండదు. ఎందుకంటే ఏడాది పొడవునా ఈ నగరంలో శీతల గాలులు వీస్తూనే ఉంటాయి.