అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలో తైవాన్ చుట్టూ యుద్ద విన్యాసాలకు చైనా తెరలేపింది.
తాజాగా తైవాన్ తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ సాంప్రదాయిక క్షిపణిని ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ సెంటర్‌కు చెందిన రాకెట్ ఫోర్స్ పరీక్షించినట్టు తెలుస్తోంది.
దీన్ని చైనా ప్రభుత్వ మీడియా కూడా నిర్దారించింది. దాదాపు 11 డాంగ్ ఫెంగ్ తరగతికి చెందిన బాలిస్టిక్ మిస్సైళ్లను నార్త్ ఈస్ట్ జలాల్లోకి చైనా ప్రయోగించిందని తైవాన్ పేర్కొంది.
ఆ క్షిపణులను ప్రయోగించిన సమయంలో తాము రక్షణ శాఖ వ్యవస్థలను యాక్టివేట్ చేసినట్టు తైవాన్ డిఫెన్స్ మినిస్టరీ వెల్లడించింది.