అది చైనా అన్‌హుయ్ ప్రావిన్స్ లో ఫుయాంగ్ సిటీ అమ్యూజ్‌మెంట్ పార్క్. చాలా మంది సందర్శకులు విచ్చేసారు. ఆటవిడుపు కోసం ఏర్పాటు చేసిన రైడ్ ని పిల్లలు,పెద్దలు ఉత్సాహంగా ఎక్కారు.
తుళ్ళింతలు, కేరింతల నడుమ రైడ్ జరుగుతూ ఉంది. సందర్శకులు ఆకాశంలో ఉండగా పెండ్యులమ్ పనిచేయడం మానేసింది. అంతే! ఎక్కన వాళ్ళంతా గుండెలు గుప్పెట్లో పట్టుకుని పెండ్యులానికి తల్లకిందులుగా వేల్లాడారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. అకస్మాత్తుగా ఏర్పడిన ఈ భయానక సంఘటనకు సందర్శకులు అల్లాడిపోయారు.
కొందరు పర్యాటకులు ఎక్కిన ఎక్కిన పెద్ద పెండ్యులం రైడ్ జాయింట్ విరిగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పది నిమిషాలు పాటు పార్కు అరుపులు కేకలతో అల్లకల్లోలం అయ్యింది. కాగా, ఆ రైడ్‌ను సరిసేందుకు అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది చాలా శ్రమపడ్డారు.
కంట్రోల్‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దీంతో ఒక వ్యక్తి ఆ రైడ్ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. అయితే ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్‌మెంట్ పార్క్ అధికారులు తెలిపారు.
దానిపై చిక్కుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.