చైనా వారు ఇక మారరా…? ఇప్పుడిదే ప్రశ్నను కాస్త కోపంగా సంధిస్తోంది ప్రపంచం. అవును… కరోనా వైరస్ దెబ్బకు చైనానా…? అంటూ ఈసడించుంటుకున్న ప్రపంచాన్ని మరింత రెచ్చగొట్టేలా చైనీయులు ప్రవర్తిస్తున్నారని పలు కథనాలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ తో చైనా వణికిపోయింది. కానీ ఇప్పుడు అక్కడ కరోనా వైరస్ కు ముందు ఉన్న పరిస్థితులు వచ్చేశాయి. సమిష్టిగా చైనీయులు కరోనా వైరస్ నుండి బయటపడగలిగారు. (కొందరైతే… వారి దగ్గర వ్యాక్సిన్ ఉంది, ఆ వైరస్ ను వారే సృష్టించి ప్రపంచం మీదికి వదిలారు అంటూ వాదించే వారు కూడా ఉన్నారు. అది వేరే సంగతి. )
అయితే, దాదాపు మూడు నెలలు లాక్ డౌన్ పిరియడ్ లో ఉండటంతో పాటు స్వేచ్ఛగా తిరగలేకపోయాం, తినాల్సింది తినలేకపోయాం అనుకున్నారో ఏమో… ఇప్పుడు చైనీయులు మళ్లీ నాన్ వెజ్ వైపు మళ్లారట. గబ్బిలాలు, కుక్కలు, పిల్లులు ఇలా అన్నింటిని తెగ లాగించేస్తున్నారట. దీనిపై ప్రపంచ మీడియా ఇప్పటికే చైనీయులను ఈసడించుకుంటుండటంతో విదేశీ మీడియా ప్రతినిధులను ఆయా మార్కెట్లలో కనీసం ఫోటోలు కూడా తీయకుండా అడ్డుకుంటున్నారట.
ఇప్పటికే జంతువులను తిని తిని ప్రపంచాన్ని నాశనం చేసే వరకు తెచ్చారు, ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారా… అంటూ సోషల్ మీడియాలో చైనీయులపై ట్రోలింగ్ నడుస్తోంది.