చైనా 23 టన్నుల లాంగ్ మార్చ్ -5B Y3 క్యారియర్ రాకెట్ కు చెందిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భారీ ఉత్కంఠకు తెరపడింది. ప్రజలు వీటిని ఉల్కలు అనుకొని వీడియోలు తీసుకున్నారు.
రాత్రిపూట ఆకాశంలో ఎరుపు, నీలం,పసుపు రంగుల అద్భుతమైన కలర్స్ కనిపించడంతో సెల్ ఫోన్స్ లోని కెమెరాలకు పనిచెప్పారు. శనివారం రాత్రి 10.45 సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించాయి. అమెరికా స్పేస్ కమాండ్ కూడా చైనా రాకెట్ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్లు నిర్ధారించింది.
తూర్పు,ఆగ్నేయాసియాలోని వేలాది మంది రాత్రి ఆకాశంలో ఆకట్టుకునే అద్భుతమైన ప్రదర్శనను చూశారు.ఇది ఉల్కాపాతం అని నమ్ముతూ చాలా మంది కెమెరాలను క్లిక్ మనిపించారు.చైనీస్ రాకెట్ మలేషియా మీదుగా కాలిపోయినట్లు కనిపిస్తోంది. ఈ శకలాలు ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్‌ఫీల్డ్ కూడా షేర్ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు.
మరోవైపు చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేసే ప్రమాదం ఉందన్నారు.చైనా ఇటీవల లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఇది అంతరిక్షంలో నిర్మించతలపెట్టిన స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను తరలించింది.
meteor spotted in kuching! #jalanbako 31/7/2022 pic.twitter.com/ff8b2zI2sw
— Nazri sulaiman (@nazriacai) July 30, 2022
Advertisements