అగ్రరాజ్యం అమెరికా పౌరుడు, బిలీనియర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ విధ్వంసానికి చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికలు వేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా స్పష్టమైంది. తమ దేశ భద్రతకు ఒకవేళ స్టార్ లింక్ శాటిలైట్‌తో ప్రమాదం ఏర్పడినట్లయితే, సదరు శాటిలైట్స్‌ను నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని అభివృద్ధి చేసి పనిలో చైనా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ద్వంసం చేసేందుకుగాను ప్రతీ స్టార్ లింక్ శాటిలైట్‌ను ట్రాక్ చేసి, మానిటర్ చేసేందుకు కావాల్సిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చైనా మిలిటిరీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వారు కథనం ప్రచురించారు.
స్టార్ లింక్ ను ఢీ కొనేందుకుగాను కచ్చితమైన టెక్నాలజీని డెవలప్ చేయడంపైన చైనా ఫోకస్ చేస్తున్నట్లు కథనంలో తెలిపారు. స్టార్ లింక్ వద్ద ఉన్న డ్రోన్లు, స్టీల్స్ ఫైటర్స్‌ను నిర్వీర్యం చేయడం అంత ఈజీ కాదని అంచనాకొచ్చిన చైనా శాస్త్రవేత్తలు..అందుకోసం కొత్త టెక్నాలజీని డెవలప్ చేయాలని భావిస్తున్నారు.
లేజర్స్, మైక్రోవేవ్ టెక్నాలజీతో స్టార్ లింక్ శాటిలైట్స్‌ను దెబ్బ తీయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్టార్ లింక్ వద్ద వేల సంఖ్యలో ఉన్న ఉపగ్రహాలు అంత సులభంగా ధ్వంసం కావని, ఈ నేపథ్యంలోనే వాటిని సైతం నిర్వీర్యం చేయగలిగే టెక్నాలజీ కోసం చైనా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తు్న్నారు.