కరోనా వైరస్ నేపధ్యంలో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు చైనీయులు క్యూ కడుతున్నారు. ఇక్కడ పలు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారితో పాటు, విద్యార్జన, వ్యాపార నిమిత్తం, బతుకు దెరువు కోసం వచ్చిన వారు చాలా మందే ఉన్నారు.ఇప్పుడు చైనాలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో చైనీయులు ఆందోళన చెందుతున్నారు. వారు ఇప్పుడు తమ దేశానికి వెళ్లాలన్నా వారికి కరోనా వైరస్ లేదని ఇక్కడి నుంచి నో ఆబ్జెక్షన్ తీసుకోవాల్సి ఉంది. తమకు వైరస్ ఉందేమోననే భయంతో కొందరు, నో ఆబక్షన్ సర్టిఫికెట్ కోసం మరికొందరు చైనీయులు గాంధీ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. గాంధీ హాస్పిటల్లో చైనీయుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ను నిర్ధారించే మెడికిట్లు తెలంగాణలో ఒక్క గాంధీ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.