కోవిడ్ నేపథ్యంలో కంగారు పడాల్సి వస్తుందిగానీ..!మనిషైపుట్టాకా దగ్గు రావడం సహజం. సీజన్లో చుట్టంలాగ వచ్చిపోతుంటుంది. అతిగా దగ్గితే గొంతు నొప్పొస్తుంది. మహా అయితే చాతి నొప్పొస్తుంది. అంతేగానీ ఏకంగా పక్కటెముకలు విరిగిపోతాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా..!ఈ సారి దగ్గింతే పక్కటెముకలు పక్కాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిందే అంటున్నారు వైద్యలు.!ఎందుకంటే చైనాలో ఓ మహిళ కేవలం దగ్గడం వల్ల నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయి. ఈ ఘటనకు ఆమే కాదు డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
చైనాలోని షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కాస్తంత ఘాటైన ఆహారాన్ని తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన దగ్గు మొదలైంది. అలా దగ్గుతున్న సమయంలో ఛాతిలో నొప్పిరావడంతో వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు గుర్తించారు.
అయితే, దగ్గితేనే ఆమె ఛాతిలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి వైద్యులు కారణం చెప్పారు. ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని వివరించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా కండరాల్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. పోతే పోయింది కారాలు కాస్త తక్కువ తిను. దగ్గేటప్పుడు ఇంకాస్త చూసి దగ్గు ఎందుకంటే రెండోపక్కటెములు కూడా ఇంపార్టెంటేగా అంటున్నారు ఈ వింతవిన్న నెటిజన్లు.