ఆలయాల నిర్వహణ బాధ్యత విషయంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు చిన్న జీయర్ హాజరైన సందర్భంగా భక్తులకు ప్రవచనాలు చేశారు.
ఎండోమెంట్ పర్యవేక్షణలో టెంపుల్స్ ఉండడం కన్నా భక్తుల నిర్వహణలో ఉంటేనే బావుంటుందని వ్యాఖ్యానించారు జీయర్ స్వామి.
భక్తుల ఆధీనంలో ఆలయాలను ఉంచినట్టయితే.. ఎంతో చక్కగా ఆదరణ భక్తుల పెరుగుతుందని తెలిపారు. అందుకు వేణుగోపాల స్వామి ఆలయమే ప్రత్యక్ష్య ఉదాహరణ అని అన్నారు.
నిర్వహణ బాధ్యతలు ఎండోమెంట్ వాళ్లు తీసుకున్నట్టయితే ఈ వైభవాలేవీ కనిపించవన్నారు. ఇప్పుడు కూడా భక్తులు ఏ శ్రద్ధతో చేసుకుంటున్నారో.. ఆ భక్తులకి ప్రోత్సాహం కల్పించే విధంగా ఆలయాలను ఉంచడం శ్రేయస్కరమని పేర్కొన్నారు జీయన్ స్వామి.