ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ సన్నిహితులు వేలు పెట్టబోతున్నారా…? బీజేపీకి కేసీఆర్ దగ్గరయ్యారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఏపీ బీజేపీకి అండగా జరగబోయే యాత్రకు కేసీఆర్ సహాయం ఉండనుందా…? కేసీఆర్ సన్నిహిత స్వామీజీ ఏపీలో దేవాలయాల పరిరక్షణ యాత్ర చేయబోతున్నారా…?
ఈ ప్రశ్నలన్నింటికి అవును అనే సమాధానమే వస్తుంది. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా పరిస్థితులను మార్చే క్రమంలో చినజీయర్ స్వామిజీ దేవాలయాల పరిరక్షణ యాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో పరిస్థితులపై స్పందించిన చినజీయర్ స్వామిజీ రాష్ట్రంలో వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటూ మండిపడుతూనే… యాత్రకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఘటన జరిగిన ఒకరోజు వెళ్లి రావటం కన్నా యాత్రలాగే ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
ఈ యాత్ర వెనుక బీజేపీ బలపడాలనే వ్యూహాం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సాములోరికి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పైగా ఇటు కేసీఆర్ తోనూ జగన్ స్నేహాం తెగిపోయిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సహాయంతో సాములోరు ఏపీలో యాత్ర చేయబోతున్నారని, చివరకు ఇది బీజేపీకి పాజిటివ్ గా మారేలా వ్యూహారచరన చేసినట్లు తెలుస్తోంది.
గుడి ఎదైనా గుడే. తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సచివాలయంలోని గుడిని ద్వంసం చేస్తే కనీసం మాట్లాడని స్వామిజీ, ఇప్పుడు మాత్రం ఏకంగా యాత్రకు ప్లాన్ చేశారంటే… ఆ ప్లాన్ వెనుక రాజకీయ కారణాలున్నట్లు అంచనా వేయాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.